బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మంత్రి బొత్స కామెంట్స్.

Published: Monday December 30, 2019
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ‘టీడీపీ నుంచి ఇంకో పార్టీలో చేరిన à°“ నేత.. రాజధాని à°’à°• అంగుళం దాటినా బీజేపీ ఒప్పుకోదని అంటున్నారు. ఆయన మాటేమైనా శాసనమా? చంద్రబాబుకు తొత్తువా? లేకపోతే మోదీ నీకు చెవిలో చెప్పారా? ఎందుకు అలా ఘీంకరిస్తున్నావు’ అని మండిపడ్డారు. ఆదివారం విశాఖలోని వైసీపీ à°•à°¾ ర్యాలయంలో, శ్రీకాకుళం మండలం రాగోలులో ఆయన మాట్లాడారు. సుజనాచౌదరికి వ్యా పారం చేసుకోవడం, ఆస్తులు పెంచుకోవడం తప్పితే అభివృద్ధి గురించి ఏం తెలుసని ప్ర శ్నించారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తొలి పది నగరాల్లో ఒకటై à°¨ విశాఖలో రూ.10 వేల కోట్లు ఖర్చుపెడితే హైదరాబాద్‌ను తలదన్నే నగరంగా తయారవుతుందని బొత్స అన్నారు. ‘హైదరాబాద్‌లో ఏమేం ఉన్నాయి.. విశాఖలో ఏం చేస్తే à°† స్థా యికి చేరుతుందనేది గుర్తించి à°† మేరకు నిధులు కేటాయిస్తే సరిపోతుంది. అభివృద్ధి అంటే సచివాలయం, అసెంబ్లీ కాదని మాజీ సీఎం చంద్రబాబు గతంలో చెప్పారు.
 
ఇప్పుడు విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులు హైదరాబాద్‌ను కోల్పోతున్నామ ని, అలాంటి నగరాన్ని మనం తయారుచేసుకోగలమా అని ఆందోళన చెందారు. ఇప్పుడా మాటలు గుర్తు చేసుకుంటే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖ మాత్రమే సరైనది చెప్పక తప్పదు. à°ˆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే కాకుండా, మంత్రిగా కూడా విశాఖ రాజధాని à°—à°¾ సరైనదనడంలో సందేహం లేదు. ఆదాయ వనరులు పెంచుకోవడానికి, రాష్ట్రానికి చే యూతగా ఉండడానికి విశాఖ అనుకూలం. అయితే చంద్రబాబు దీనిపై మాట్లాడుతున్న తీరు దురదృష్టకరం. వెనుకబడిన ఉత్తరాంధ్ర, కరువుతో అల్లాడుతున్న ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఇష్టమో కాదో ఆయన చెప్పాలి. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినపుడల్లా రాజధానులు మారవు. అయినా జరిగిన తప్పులను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన అశోక్‌గజపతిరాజు ఐదేళ్లపాటు కేంద్ర మంత్రిగా పనిచేసి à°ˆ ప్రాంతానికి ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారు’ అని ఆరోపించారు.