జేసీ దివాకర్‌రెడ్డికి బెయిల్‌

Published: Saturday January 04, 2020
మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసులు స్టేషన్‌ బెయిలిచ్చారు. 6గంటలకు పైగా ఆయన్ను పోలీస్‌స్టేషన్‌లోనే నిర్భందించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జేసీపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల à°•à°¿à°‚à°¦ కేసు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పీఎస్‌ ఎదుట జేసీ అనుచరుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎట్టకేలకు జేసీకి స్టేషన్‌ బెయిల్ ఇచ్చారు.
 
 
అంతకుముందు ముందస్తు బెయిల్ కోసం అనంతపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు à°¦à°¿à°µà°¾à°•à°°à±‌రెడ్డి  వెళ్లారు. అయితే ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ఆరు à°—à°‚à°Ÿà°² పాటు స్టేషన్‌లోనే పోలీసులు ఉంచారు. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. మీడియాను చూసిన పోలీసులు రెచ్చిపోయారు. పీఎస్ ఆవరణ నుంచి వెళ్లిపోవాలంటూ మీడియాకు పోలీసులు హుకుం జారీ చేశారు. జేసీని నిర్భందించారనే సమాచారంతో ఆయన అనుచరులు, టీడీపీ నేతలు భారీగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. à°“ దశలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. మరోవైపు పోలీసులతో టీడీపీ నేతలు పార్థసారథి, రఘునాథరెడ్డి, ఈరన్న వాగ్వాదానికి దిగారు. దీంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.