ధైర్యంగా పోరాడి చరిత్రలో నిలుద్దాం

Published: Tuesday January 07, 2020
‘అమరావతి నుంచి రాజధానిని తరలించి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఖబడ్దార్‌!’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు వీరోచితంగా పోరాడతానని స్పష్టం చేశారు. ‘అమరావతి విపత్తులో పడింది. ఇది నా సొంత విషయం కాదు. భావితరాల సమస్య. à°ˆ ప్రాణం ఎప్పుడైనా పోయేదే.. పిరికితనంతో ప్రతిరోజూ చచ్చేకంటే ధైర్యంగా పోరాడి చరిత్రలో నిలిచిపోదాం. పోలీసులతో ప్రజా ఉద్యమాన్ని అణచలేరు. ఉద్యమకారులపై కేసులు పెడితే జైళ్లు, పోలీసు స్టేషన్లు సరిపోవు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమనండి. నేనే ముందుంటా. అవసరమైతే జైలుకు పోదాం.. విద్యార్థులు, యువత కేసులకు భయపడి పిరికితనంతో వెనకడుగు వేయొద్దు. వీధుల్లోకి వచ్చి పోరాడాలి. à°ˆ ప్రభుత్వానికి మన సత్తా ఏంటో చాటిచెబుదాం à°°à°‚à°¡à°¿’ అని పిలుపిచ్చారు.
 
సోమవారం ఉదయం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని వేదిక ఫంక్షన్‌ హాలులో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 à°—à°‚à°Ÿà°² రిలే నిరాహార దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. సాయంత్రం మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి క్షేత్రాన్ని దర్శించారు. ఆయన ఆలయంలోకి ప్రవేశించగానే క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు హర్షధ్వానాలు చేశారు. జై అమరావతి... జై జై అమరావతి అంటూ పెద్ద పెట్టున నినదించారు. ఆయనకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ ముఖమండపంలో బంగారు దక్షిణావృత శంకువుతో అర్చకస్వాములు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి ఇక్కడే ఉండాలని నృసింహుని వేడుకున్నానని చెప్పారు. తర్వాత రాజధాని గ్రామాల్లో పర్యటించారు.