ఏపీలో పెరిగిన మానవ అక్రమ రవాణా

Published: Friday January 10, 2020
ప్రభుత్వాలు ఎన్ని à°•à° à°¿à°¨ చట్టాలు చేస్తున్నా మహిళలకు రక్షణ కరువవుతోంది. నేరాల బారిన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. మహిళలపై జరిగిన నేరాల్లో భర్త, అతడి బంధువుల నుంచి ఎదురైన వేధింపుల కేసులే అత్యధికమని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. 2018లో రాష్ట్రంలోని ప్రతి లక్షమంది మహిళల్లో 63.2మంది నేరాల బారినపడ్డారని గురువారం విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రతి 100మంది బాధిత మహిళల్లో ఏపీకి చెందినవారు 4.3 మంది ఉన్నారని తెలిపింది. 2018లో ఏపీలో 937 అత్యాచార కేసులు నమోదయ్యాయి. à°ˆ ఘటనల్లో 912 మంది బాధితులకు నిందితులు తెలిసినవారే కావడం గమనార్హం. 64 ఘటనల్లో బాధితురాలి కుటుంబ సభ్యులే నిందితులు. 474 ఘటనల్లో నిందితులు బాధితుల స్నేహితులు, సహోద్యోగులు, ఇరుగు పొరుగువారే. 374 ఘటనల్లో నిందితులు బాధితులకు ఆన్‌లైన్‌లో పరిచయమైనవారు, సహజీవనం చేస్తున్నవారు, విడాకులు తీసుకున్న భర్తలు ఉన్నారని ఎన్‌సీఆర్‌బీ వివరించింది.
 
  • మహిళలపై నేరాలకు సంబంధించి 2016లో 16,362 కేసులు నమోదవగా, 2017లో 17,909, 2018లో 16,438 కేసులు నమోదయ్యాయి.
  • మహిళలను ఆత్మహత్య చేసుకునే దిశగా ప్రేరేపించిన నేరాలు 406.
  • భర్త, అతడి బంధువుల చేతిలో చిత్రహింసలకు గురైన కేసులు 6,831. మహిళలపై జరిగిన మొత్తం నేరాల్లో వీటి శాతం 26.3 శాతం.
  • 719మంది మహిళలు కిడ్నా్‌పకు కాగా వారిలో ఐదుగురు హత్యకు గురయ్యారు.
  • సైబర్‌ క్రైమ్‌ బారిన పడిన మహిళల కేసులు 126
  • 2018లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 16,438 కేసులు నమోదుకాగా, 10,583 కేసుల విచారణ పెండింగ్‌లో ఉంది.