ఉద్యమం పట్టని నటుల తీరుపై ఆగ్రహించిన రాజధాని గ్రామాలు

Published: Friday January 10, 2020
రాజధాని కోసం రైతుల గుండెలు ఆగుతున్న తీరుపై ఆవేదన! అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేస్తున్న సర్కారు క్రూరత్వంపై ఆగ్రహం! వెరసి.. అమరావతి గ్రామాలు వరుసగా 23à°µ రోజున భగ్గుమన్నాయి. రాజధాని గ్రామాల్లోని అసైన్డ్‌ భూముల రైతులు దళిత జేఏసీ ఆధ్వర్యంలో తుళ్లూరు మహాధర్నా శిబిరంలో నిరసన తెలిపారు. తమ ఆందోళనలపై చిత్ర పరిశ్రమ స్పందించకపోతుండటంపై రాజధాని గ్రామాలు ఆగ్రహించాయి. ఇప్పటికే à°ˆ గ్రామాల్లోని సినిమా థియేటర్లలో చిత్ర ప్రదర్శనలు నిలిచిపోగా, సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు చూడకూడదని గురువారం తీర్మానించారు. రాజధాని రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులుగా అభివర్ణించిన నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్‌ ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ, నిరసన తెలిపారు. ఉద్యమానికి విరాళంగా దొండపాడుకు చెందిన భానుశ్రీ కుమార్తె హాసిని తన రెండు గాజులను ఇచ్చారు. మరికొందరు కూడా బంగారు చెవిదిద్దులు, నగదు విరాళాన్ని అందించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో వాహనదారులకు, ప్రయాణికులకు రైతులు పూలు అందించి మద్దతు పొందారు. హైవే దిగ్బంధనం ఘటనలో రాజధాని ప్రాంతానికి చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తుళ్లూరు మహాధర్నాను సందర్శించారు. శిబిరంలోని రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడబోగా.. సమీపంలోని మసీదులో మధ్యాహ్నం వేళ నమాజ్‌ ప్రారంభమైంది. ముస్లిం సోదరుల మనోభావాలను గౌరవిస్తూ నమాజ్‌ పూర్తయ్యేవరకు లోకేశ్‌ ఆగి, à°† తరువాత తన ప్రసంగం మొదలుపెట్టారు. శిబిరంలోని ప్రతి మహిళను పలకరించి.. ఉద్యమంలో కొనసాగుతున్నందుకు వారిని అభినందించారు. అనంతరం రైతులకు భోజనం వడ్డించి, తానూ వారితో కలిసి లోకేశ్‌ భుజించారు.