పృథ్వీ వ్యాఖ్యలపై వైసీపీ నిర్ణయమిది

Published: Saturday January 11, 2020
రాజధానిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం సీరియస్‌ అయింది. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడటంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. పృథ్వీపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధిష్టానం à°°à°‚à°—à°‚ సిద్ధం చేసినట్లు సమాచారం. పృథ్వీ వ్యాఖ్యలపై తోటి నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఉద్యమం చేసేవాళ్లంతా పెయిడ్ ఆర్టిస్టులని పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కార్పొరేట్ ముసుగులో ఉన్న రైతు ఉద్యమమని రాజధాని రైతులను ఉద్దేశించి పృథ్వీ వ్యాఖ్యానించారు.
 
 
 
రైతులంటే మోకాలి లోతు బురదలో ఉండి.. కాళ్లు కడుక్కుని ఏదో తిని ఉండేవాళ్లని.. కానీ ఖద్దరు బట్టలు, నాలుగైదు గొలుసులు వేసుకున్న రైతులను అమరావతిలోనే చూస్తున్నానని పృథ్వీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఆడపడుచులను, రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లన్నందుకు పృథ్వీ సిగ్గుపడాలని పోసాని కౌంటర్ ఇచ్చారు. రైతులకు పృథ్వీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోసాని వ్యాఖ్యలకు పృథ్వీ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, పోసాని విమర్శలను తాను ఆశీర్వాదంగానే భావిస్తానని పృథ్వీ చెప్పారు. వైసీపీ అధిష్టానం కూడా పృథ్వీపై చర్యలకు సిద్ధం కావడం గమనార్హం.