విమానాన్ని పొరపాటున కూల్చేశాం

Published: Saturday January 11, 2020
 à°‰à°•à±à°°à±†à°¯à°¿à°¨à± విమాన ప్రమాదంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. à°† విమానం కూలిపోవడానికి తామే కారణమని.. పొరపాటున కూల్చేశామని ప్రకటించింది. à°ˆ ప్రమాదంలో 176 మంది మరణించిన విషయం తెలిసిందే. ఒకపక్క ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులకు పాల్పడతున్న సమయంలోనే.. టెహ్రాన్ నుంచి బయలు దేరిన ఉక్రెయిన్ విమానం ప్రమాదానికి గురైంది. మొదట తమ తప్పేమి లేదని తెలిపిన ఇరాన్.. తాజాగా విమాన ప్రమాదంపై తన తప్పును అంగీకరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జారీఫ్ తన ట్విట్టర్‌లో à°ˆ విషయాలను తెలిపారు. తమ అంతర్గత విచారణలో à°ˆ విషయం తేలిందని చెప్పారు. మిలటరీ యూనిట్‌కు దగ్గరలో విమానం ప్రయాణిస్తున్న కారణంగా.. అనుకోకుండా విమానాన్ని మిస్సైల్‌తో పేల్చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
 
 
అమెరికా దుస్సాహ‌సం à°µ‌ల్ల జరిగిన మాన‌à°µ à°¤‌ప్పిందంగా ఆయన అభివర్ణించారు. à°ˆ ప్రమాదానికి కారణమైన వారిని శిక్షిస్తామని తెలిపారు. ప్ర‌మాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌కు ఇరాన్ మంత్రి సంతాపం తెలిపారు. à°ˆ సందర్భంగా ప్ర‌à°œ‌à°²‌కు, బాధిత కుటుంబాల‌కు, ప్రమాదం వల్ల ప్రభావానికి గురైన దేశాల‌కు క్ష‌మాప‌à°£‌లు చెప్పారు.
 
 
Tags : Iran, USA, Ukraine