ఢిల్లీలో పవన్ ఎవరెవరిని కలిశారంటే

Published: Monday January 13, 2020
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ ముఖ్య నేతలతో సోమవారం భేటీ అయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డాను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. à°ˆ సందర్భంగా పవన్ ఆయనకు దేవుని ప్రతిమను అందజేశారు. పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అదే సమయంలో.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్య కూడా నడ్డా నివాసంలో ఉన్నారు.
 
సీఎం జగన్ ‘మూడు రాజధానుల ప్రతిపాదన’ అనంతరం రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆయన కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. రాజధాని మార్పు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అశాంతిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అది కేంద్ర ప్రభుత్వ ధర్మం... బాధ్యతని రైతులను కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారు.
 
 
 
కాంగ్రెస్‌, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని విభజించాయని, విభజన వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారం బాధ్యత కూడా à°† పార్టీల పైనే ఉందని పవన్ à°† సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందుకే à°† పార్టీని, ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. à°’à°• రాష్ట్రంలో అశాంతి చోటు చేసుకుని ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నప్పుడు అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారు జోక్యం చేసుకుని పరిష్కరించాలని కేంద్రాన్ని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. సంబంధం లేదని దూరంగా ఉండడం సరికాదని, రాజధాని అమరావతికి ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని పవన్ గుర్తుచేశారు.
 
రాజధాని నిర్మాణానికి నిధులు కూడా ఇచ్చారని, అందువల్ల వారిపై బాధ్యత ఉందని ఆయన చెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ముందుకొస్తారని, రావాలని కోరుకుంటున్నానని.. కేంద్రం స్పందించే పరిస్థితులు కల్పిస్తానని రైతులు కలిసిన సందర్భంలో జనసేన అధినేత స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే.. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం.. కేంద్ర పెద్దల నుంచి పిలుపు రావడంతో పవన్ రెండు రోజుల క్రితం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.