వైసీపీలో స్థానిక చిచ్చు

Published: Friday January 17, 2020
మంత్రి ఇలాఖా వైసీపీలో ముసలం పుట్టింది. ఇటీవల పెనుకొండ నియోజకవర్గంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి శంకరనారాయణ తీరుపై కొందరు సీనియర్‌ నాయకులు సోమందేపల్లి మండలంలో సమావేశం పెట్టి ఫైర్‌ అయ్యారు. వైసీపీలో వర్గ విభేదాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బుధవారం సంక్రాంతి పండుగ రోజున సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో వైసీపీ అసమ్మతి నేతలు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైసీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న ఈదులబళాపురం నాగభూషణ్‌రెడ్డి, అశ్వత్థమ్మ పార్టీ అసంతృప్తి వాదులతో సమావేశమై మంత్రి, మండలంలోని ముఖ్య నాయకుల తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు.
 
ఈసందర్భంగా సమావేశానికి హాజరైన నాయకులు మాట్లాడుతూ వైసీపీ పుట్టినప్పటి నుండి జెండాలు మోసాం, అవమానాల పాలయ్యాం, కేసులు పెట్టారు, అయినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకుండా, పార్టీ జెండా ముఖం చూడని వారికి పట్టం కడతారా అంటూ మంత్రిపై, మండల నాయకులు తీరుపై ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌మెహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే ధ్యేయంతో మండల వ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేసి, కష్టపడ్డామన్నారు. నాయకులు వస్తే ఖర్చులకు వెనుకాడకుండా పనిచేశాం, పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని నమ్ముకొన్న కార్యకర్తలకు న్యాయం చేయవచ్చునని భావించామన్నారు. à°—à°¤ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న పలు శాఖల సిబ్బందిని మార్చడానికి వెళితే మండల ముఖ్య నాయకులు మా గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.
 
మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.. అయినప్పటికి పార్టీ కోసం ఓర్చుకొని పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్‌లో ఎంపీపీ, జడ్పీటీసీ జనరల్‌ మహిళకు కేటాయిస్తే, వాటిని కూడా పార్టీ కోసం పనిచేసిన తమలాంటి వాళ్లకు కాకుండా ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. కేవలం డబ్బున్న వారికే మంత్రి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. రెడ్డి సామాజిక వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం రాకుండా మంత్రి రిజర్వేషన్లనే మార్పించేశారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళదామని నిర్ణయించారు.
 
à°ˆ సమా వేశంలో చాలకూరు వైసీపీ సీనియర్‌ నాయకురాలు అశ్వత్థమ్మ, పందిపర్తి శ్రీనివాసరెడ్డి, చాకర్లపల్లి తిమ్మారెడ్డి, శ్రీధర్‌, రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, దివాకర్‌రెడ్డి, వందలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.