జనసేన అంతర్జాతీయ పార్టీ కావొచ్చేమో

Published: Friday January 17, 2020
జనసేన, బీజేపీ పొత్తుపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. à°ˆ సందర్భంగా ఏపీలో జనసేన-బీజేపీ పొత్తుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పొత్తుపై ఇప్పుడే స్పందించలేనన్న ఆయన.. జనసేన అంతర్జాతీయ పార్టీ కూడా కావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. అయినా పక్కరాష్ట్రంలో పవన్‌ ఏం చేస్తే తమకేంటని అన్నారు. à°† విషయాన్ని ఏపీ ప్రజలు చూసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
 
 
 
ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. విజయవాడలో జరిగిన ఇరుపార్టీల సమావేశంలో పొత్తుపై అధికారిక నిర్ణయం తీసుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా తమ కూటమి పని చేస్తుందని.. అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు.