షిరిడీలో ఎలాంటి ఇబ్బంది లేదు.

Published: Sunday January 19, 2020
షిరిడీలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. యథాప్రకారం à°·à°¿à°°à°¿à°¡à±€ సాయిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఆదివారం నుంచి ఆలయం నిరవధికంగా మూతపడనుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, ప్రతిరోజూ దర్శించుకుంటున్నట్టే భక్తులు ఆదివారంనాడు కూడా బాబా దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండి, తమ వంతు రాగానే దర్శనాలు చేసుకుంటున్నారు. 
 
 
షిరిడీకి కుటుంబ సమేతంగా వచ్చి శనివారంనాడు బాబాను దర్శించుకుని, బాబాకు వీడ్కోలు దర్శనంగా ఆదివారం ఉదయం మరోసారి దర్శించుకుని,. స్థానికుల బంద్ పిలుపుతో  దుకాణాలు, వ్యాపారాలు బంద్ అయినప్పటికీ దేవస్థానం కల్పించే నిత్య ప్రసాద వితరణ, అన్నదానంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదని చెప్పారు, శని, ఆదివారం రోజుల్లో సహజంగానే రద్దీ ఉంటుందని, à°·à°¿à°°à°¿à°¡à±€ బంద్ కారణంగా à°’à°•à°¿à°‚à°¤ భక్తుల తాకిడి తక్కువగానే ఉన్నప్పటికీ  యాత్రీనివాస్ రూమ్‌లు కిటకిటలాడుతున్నాయని, యథాప్రకారం భక్తులు సాయిబాబాను దర్శించుకుని వెళ్తున్నారని చెప్పారు. స్థానికుల నిరవధిక బంద్ ప్రభావం ఆలయంపై పడకుండా తగు చర్యలు తీసుకున్నట్టు à°·à°¿à°°à°¿à°¡à±€ సాయి సంస్థాన్ ట్రస్ట్ సైతం à°“ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే.
 
బాబా జన్మస్థలమైన పత్రి గ్రామానికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వివాదానికి కారణమైంది. పత్రిని బాబా జన్మస్థలంగా ప్రకటిస్తే à°·à°¿à°°à°¿à°¡à±€ ప్రాశస్త్యం తగ్గిపోతుందని à°·à°¿à°°à°¿à°¡à±€, పరిసర గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జన్మస్థలం ప్రకటనను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేస్తూ à°·à°¿à°°à°¿à°¡à±€ నివరధిక బంద్‌కు పిలుపునిచ్చారు.