ఉత్తరాంధ్రలో జగన్‌కు 32 వేల ఎకరాలు

Published: Wednesday January 22, 2020

‘‘ఉత్తరాంధ్రలో బినామీల పేరుతో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి 32 వేల ఎకరాల భూమి ఉంది. దాని విలువను పెంచుకోవడానికే సీఎం రాజధానిని మార్పు చేస్తున్నారు. వాటి పూర్తి ఆధారాలను త్వరలోనే బయటపెడతాం. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మొత్తం అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు’’ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎన్‌.తులసిరెడ్డి, ఎస్కే మస్తాన్‌వలీ ఆరోపించారు. మంగళవారం విజయవాడలో వారు విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడే జగన్‌ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో à°ˆ ఆస్తులను కూడబెట్టుకున్నారన్నారు. వాటిపై ప్రేమతో రాజధానిని మార్చుతున్నారు తప్ప, ఉత్తరాంధ్రపై ఆయనకు ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి ఒక్క రాజధానీ లేకుండా చేశారని విమర్శించారు. సచివాలయం, రాజ్‌భవన్‌, శాసనసభ, శాసనమండలిని కలిపి రాజధానిగా పేర్కొంటారని, హైకోర్టు రాజధాని పరిధిలోకి రాదని వివరించారు. దేశంలో సుమారు 20 హైకోర్టులు రాజధానులకు వెలుపల ఉన్నాయని చెప్పారు. అటు చంద్రబాబు, ఇటు జగన్‌ ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనని విమర్శిం చారు. సాధారణ ఎన్నికల సమయంలోనే రాజధానిని మార్చుతామని జగన్‌ ప్రకటించి ఉంటే à°† పార్టీకి కనీసం 20 సీట్లు కూడా వచ్చేవి కాదన్నారు. జగన్‌ నిజంగా మొనగాడయితే అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలన్నారు. లేకపోతే మోసగాడిగానే మిగిలిపోతాడని ఎద్దేవా చేశారు.