మూడు రాజధానులపై వైసీపీ, టీడీపీ శ్రేణుల్లో భిన్నస్వరాలు

Published: Wednesday January 22, 2020
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తమ పరిస్థితి వుందని కిందిస్థాయి నేతలు వాపోతున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుపై అధికార పార్టీలో కొంతమంది సానుకూలత వ్యక్తం చేస్తుండగా, మరికొంత మంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
 
 
ప్రజలు వ్యక్తిగత ప్రయోజనాలు, లబ్ధిని ఆశిస్తూ, ప్రభుత్వం తమకు ఏమిచ్చిందన్నదే చూస్తున్నారు తప్ప పాలనాపరంగా తీసుకునే నిర్ణయాల గురించి పట్టించుకోవడంలేదని అధికార పార్టీకి చెందిన నర్సీపట్నం నియోజకవర్గం నేత ఒకరు అభిప్రాయపడ్డారు. రాజధాని à°’à°•à°Ÿà°¿ వున్నా.... మూడు వున్నా... ముప్పై ఉన్నా తమకు ఒరిగేదేమీ వుండదని సామాన్య ప్రజానీకం భావిస్తున్నారని à°† నేత విశ్లేషించారు. అదే విధంగా ప్రభుత్వం కూడా తాను తీసుకోబోయే నిర్ణయాలపై పార్టీ నేతల అభిప్రాయాలు, మనోగతాన్ని తెలుసుకోవడంలేదని, ఇది తమ పార్టీతోపాటు ప్రతిపక్షంలోనూ వుందని నిర్వేదంతో చెప్పారు. ఏ పార్టీ వారైనా సరే అధిష్ఠానం నుంచి వచ్చే ఆదేశాలను పాటించడం, షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం తప్ప వాటిని కాదనే పరిస్థితి లేదంటున్నారు.
 
 
మూడు రాజధానుల ఏర్పాటు తమ పార్టీలో కొంతమందికి ఇష్టం లేదని, అయినప్పటికీ పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ర్యాలీలు నిర్వహించి, సీఎం జగన్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నామని ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన మరో నేత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కొన్ని ప్రాంతాలకు అనుకూలంగా, మరికొన్ని ప్రాంతాలకు వ్యతిరేకంగా వుండవచ్చని, కానీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు కూడా ఇవ్వడం లేదని కొద్దిరోజుల క్రితం వైసీపీలో చేరిన నర్సీపట్నం నాయకుడొకరు వ్యాఖ్యానించారు