విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి

Published: Thursday January 23, 2020
 à°¸à±€à°¬à±€à° కేసులు 11, చార్జిషీట్లు 11, అయిదు ఈడీ కేసుల్లో ముద్దాయిగా వుండి వ్యక్తులను, వ్యవస్థలను ప్రభావితం చేస్తున్న ఏ-2 విజయసాయిరెడ్డికి బెయిల్‌ రద్దు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్‌ చేశారు. మగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం ఆమె మాట్లాడారు. కుట్రపూరిత నేరాలు, మోసపూరితమైన నేరాలు, తప్పుడు లెక్కలు చూపించినందుకు విజయసాయిరెడ్డిపై లెక్కలేనన్ని సెక్షన్ల à°•à°¿à°‚à°¦ కేసులు నమోదయ్యాయని తెలిపారు.
 
 
జనవరి 2, 2012à°¨ విజయసాయిరెడ్డి అరెస్టయ్యారన్నారు. హైదరాబాద్‌ సీబీఐ స్పెషల్‌ కోర్టు అక్టోబరు 8, 2013à°¨ బెయిల్‌ ఇచ్చిందన్నారు. బెయిల్‌ కండిషన్‌లో ఎవ్వరినీ ప్రభావితం చేయవద్దని, ముఖ్యమైన సూత్రధారి (కింగ్‌పిన్‌) అని ఏ-2ని ఉద్దేశించి చెప్పిందని గుర్తు చేశారు. అయినా ఆరేళ్లుగా ఆయన బయటే తిరుగుతూ ప్రలోభపెడుతున్నారని ధ్వజమెత్తారు. సాయిరెడ్డి శాసనమండలి వీఐపీ గ్యాలరీలో కూర్చొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు.