ఖాళీ స్థలాల్లో అక్రమంగా పాగా

Published: Thursday February 06, 2020
ఇవన్నీ గుట్టు చప్పుడు కాకుండా, కేసులదాకా రాకుండా జరిగిన లావాదేవీలు. ఇక... విశాఖలో భూకబ్జాలు, వివాదాలపై అధికారికంగానే à°—à°¤ ఏడు నెలల్లో 338 కేసులు నమోదయ్యాయి. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదులు, నమోదవుతున్న కేసులే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రజా ప్రతినిధులే భూములను ఆక్రమించుకుంటుంటే కేసులు నమోదు చేయలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. విశాఖపట్నంలోని పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. à°—à°¤ ఏడాది జూలై నుంచి à°ˆ ఏడాది జనవరి వరకు భూ వివాదాలకు సంబంధించి 338 ఫిర్యాదులు నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ ఇంత సంఖ్యలో à°ˆ ఫిర్యాదులు లేవని, ఇటీవల వీటి సంఖ్య పెరుగుతోందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని ప్రభుత్వం చూస్తుండడంతో భవిష్యత్తులో ఇక్కడ భూకబ్జాలు ఇంకా పెరుగుతాయని అంటున్నారు.
 
అసలు వీటి కోసం ప్రత్యేకంగా à°’à°• పోలీస్‌ స్టేషన్‌ పెట్టాలనే డిమాండ్‌ కూడా ఉందని ఆయన గుర్తు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, పలుకుబడి కలిగినవారు, రియల్టర్లే భూ ఆక్రమణలకు తెగబడుతున్నారు. ఎంతో కొంత స్థలం కొనుగోలు చేయడం, పక్కనే ఉన్న ఇతరుల స్థలం అందులో కలిపేసుకోవడం à°’à°• రకమైన ఆక్రమణ కాగా... ఖాళీగా కనిపించే స్థలాల చుట్టూ ప్రహరీ నిర్మించేసి, అందులో ముఠాలను కాపలాగా పెట్టి యజమానులను బెదిరించి పంపేయడం మరో రకమైన కబ్జా. à°’à°• స్థలాన్నే à°’à°•à°°à°¿ కంటే ఎక్కువ మందికి విక్రయించి మోసం చేయడం ఇంకో à°°à°•à°‚. అది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలిశాక కూడా ఆక్రమించడం, గెడ్డలను పూడ్చేసి కలిపేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. à°ˆ తరహా వివాదాలు ఎక్కువగా మధురవాడ, పీఎం పాలెం, కొమ్మాది, రుషికొండ, ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లోనే తలెత్తుతున్నాయి. à°ˆ ప్రాంతంలోనే కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిశ్చయించడం గమనార్హం.