మాంద్యాన్ని అరికట్టలేని ‘మహాపద్దు’

Published: Friday February 07, 2020
కొత్త ఆర్థిక సంవత్సర(2020–21) కేంద్ర బడ్జెట్ రూ.30.42 లక్షల కోట్ల మహా పద్దు. 2019–-20 సవరించిన బడ్జెట్‌ కంటే రూ.3.42 లక్షల కోట్లు ఎక్కువ. ప్రత్యక్ష పన్నుల ద్వారా 24.23 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం ద్వారా రూ.3.85లక్షల కోట్లు, అప్పుల ద్వారా రూ.8.49 లక్షల కోట్లు, ప్రభుత్వరంగ సంస్థల లాభాల్లో డివిడెండ్స్‌ ద్వారా రూ.1.55 లక్షల కోట్లు, ప్రభుత్వ à°°à°‚à°— సంస్థ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు బడ్జెట్‌à°•à°¿ ఆదాయం సమకూరుతుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.
 
 
మొత్తంగా పన్ను ఆదాయంలో గతంలో కంటే à°ˆ బడ్జెట్‌లో అదనంగా 12శాతం వృద్ధిని చూపారు. 2019–-20 బడ్జెట్‌లో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితమౌతుందని చూపగా అది 3.5 శాతానికి చేరింది. ఇప్పుడు à°ˆ బడ్జెట్‌లో ద్రవ్యలోటును 3.8 శాతంగా ఉండగలదని పేర్కొన్నారు. సవరించిన 2019-–20 బడ్జెట్‌లో సుమారు 88వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని తెలిపారు. వాస్తవంగా à°ˆ తగ్గుదల రూ.1.55 లక్షల కోట్లకు పైబడి వుంటుంది. ఆర్ధిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో పన్నుల ద్వారా వస్తుందని చూపిన ఆదాయం సాధ్యమయేది కాదు. వివిధ రంగాలకి, పథకాలకి, కార్యక్రమాలకి కోత పెట్టడం అనివార్యం.
 
ద్రవ్యలోటు తగ్గింపునకు మూడు పద్ధతులను ప్రభుత్వం అనుసరిస్తున్నది. మొదటిది-, మౌలిక వసతులు, సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాల మీద పెట్టే ఖర్చులో కోత. పెరిగిన ఆదాయానికి అనుగుణంగా వీటిపై నిధుల కేటాయింపు పెంచరు. రెండోది,- ప్రభుత్వ à°°à°‚à°— సంస్థల ఆస్తులను అమ్మడంద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం. మూడోది,- ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోకుండా బడా సంస్థలకు, సంపన్నులకు భారీ రాయితీలిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంది. à°ˆ పద్ధతుల ద్వారా ద్రవ్యలోటును కుదిస్తున్నారు. దీనివల్ల ప్రజల వినియోగ వ్యయం, సమిష్టి డిమాండ్‌పై తీవ్ర దుష్ప్రభావం కలుగుతున్నది.