బినామీ పేరిట 650 ఎకరాల కొనుగోలు

Published: Sunday February 09, 2020

విశాఖలో భారీ భూకుంభకోణాలు చోటుచేసుకున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందుకు 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే బీజం పడిందన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలోనే మకాం వేసి భూ ఆక్రమణలకు చక్రం తిప్పుతున్నారని ధ్వజమెత్తారు. శనివారమిక్కడి పార్టీ కార్యాలయంలో టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పంచుమర్తి అనురాధ విలేకరులతో మాట్లాడారు. విశాఖలో భూ ఆక్రమణలపై పార్టీ అధిష్ఠానం నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులుగా తాము పలుచోట్ల పర్యటించామన్నారు. à°ˆ సందర్భంగా స్థానికులు, తమ పార్టీ నేతల ద్వారా తమ దృష్టికి వచ్చిన అనేక విషయాలను రాష్ట్ర ప్రజలకు చెప్పాలని నిర్ణయించామన్నారు. డాక్యుమెంట్లు త్వరలో బహిర్గతం చేస్తామని తెలిపారు. ‘విజయసాయిరెడ్డి తన అల్లుడికి సన్నిహితంగా ఉండే నాటా సభ్యుడు ప్రతా్‌పరెడ్డిని బినామీగా పెట్టుకుని భీమిలిలో 650 ఎకరాలు కొనుగోలు చేశారు. ప్రతా్‌పరెడ్డి ద్వారా రూ.320 కోట్ల విదేశీ పెట్టుబడులు అరబిందో సంస్థకు అనుబంధంగా ఏర్పాటుచేసిన పలు సూట్‌కేసు కంపెనీలకు తరలించారు.

 

అమెరికాలోని డాలస్‌ కేంద్రంగా జరిగిన à°ˆ ఒప్పందంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాత్ర కూడా ఉంది. చిట్టివలస జూట్‌మిల్లును తెరిపిస్తానని ఎన్నికల ముందు తగరపువలస బహిరంగ సభలో జగన్‌ ఇచ్చిన హామీకి విరుద్ధంగా విజయసాయిరెడ్డి బ్యాచ్‌.. మార్వాడీ సామాజిక వర్గానికి చెందిన మిల్లు యజమానిని బెదిరించి భూములు కైవసం చేసుకుంటున్నారు. భీమిలికి వెళ్లే బీచ్‌రోడ్డులో కార్తీకవనం లీజుకు తీసుకున్న ఉమేశ్‌ అనే వ్యక్తిని బెదిరించి 50 శాతం వాటా రాయించుకున్నారు. ప్రస్తుతం అక్కడ భూములను రాడిసిన్‌ హోటల్‌కు ఇచ్చారు. నగర నడిబొడ్డున సిరిపురంలో టైకూన్‌ హోటల్‌ సమీపంలో క్రైస్తవ మిషనరీకి చెందిన విలువైన భూములు కాజేయడానికి ఇరువర్గాల మధ్య ఒప్పందం చేసేందుకు విజయసాయి, బ్రదర్‌ అనిల్‌కుమార్‌ యత్నిస్తున్నారు. à°ˆ స్థలంలో భారీమాల్‌ నిర్మించాలనే ఆలోచనతోనే లులు గ్రూప్‌ను విశాఖ నుంచి తరిమేశారు.

 

ఆనందపురం మండలం నీళ్లకుండీలు ప్రాంతంలో à°“ వ్యక్తి కుటుంబానికి చెందిన 75 ఎకరాలు కొట్టేయడానికి వైసీపీ నాయకులు, వారికి అన్ని రకాలుగా సాయమందించే à°“ ఆడిటర్‌ ప్రయత్నిస్తున్నారు. వాల్తేర్‌ క్లబ్‌ స్వాధీనానికి ఇటీవల కలెక్టర్‌, ఇతర అధికారులతో విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. à°ˆ వ్యవహారంపై ప్రభుత్వ పరిధిలోని సీబీసీఐడీతో కాకుండా సిట్టింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలి. అదే సమయంలో అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ప్రభుత్వ పెద్దలంతా ఆరోపణలు చేస్తున్నందున దానిపైనా విచారణ చేయించాలి’ అని కోరారు. జగన్‌కు విశాఖ భూములపై ఎంతో ప్రేమని.. అదే సమయంలో 2014 ఎన్నికల్లో వైఎస్‌ విజయలక్ష్మి ఓటమి చెందినప్పటి నుంచి విశాఖపై కక్ష పెంచుకున్నారని.. నిరుటి ఎన్నికల్లో నగరంలోని 4 అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలుచుకోవడంతో పగ మరింత పెరిగిందని ఆరోపించారు.