సీఎంను అభినందిస్తారని ఆశించా.. కానీ..’

Published: Sunday February 09, 2020

విశాఖలో పరిపాలనా రాజధాన్ని వ్యతిరేకించడం సరికాదని మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. లక్ష్మీనారాయణనగర్‌లోని తన కార్యాల యంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. 38 ఏళ్లుగా ప్రజలతో గౌరవం పొందుతూ పదవులు తీసుకున్న అయ్యన్న, విశాఖలో రాజధాని ఇస్తున్నందుకు సీఎంను అభినందిస్తారని ఆశించానని చెప్పారు. అందుకు విరుద్ధంగా సభ్యత లేని భాషతో విమర్శించడం ఆయనకు తగదన్నారు. 42 కిలోమీటర్ల దూరం వరకు చంద్రబాబు ప్రభుత్వం మెట్రో రైలుకు ప్రతిపాదించగా, సీఎం జగన్‌ 80 కిలోమీటర్లకు ప్రతి పాదిస్తూ నివేదికలు తయారు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఒకేచోట అభివృద్ధి జరిగితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే నినాదాలు వచ్చే అవకాశం ఉందని దాడి పేర్కొన్నారు.