పీఎం-కిసాన్‌ నిధుల విడుదలపై రాష్ట్ర విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం

Published: Wednesday February 12, 2020

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం à°•à°¿à°‚à°¦ రైతులకు మూడు దఫాలుగా రూ.2వేల చొప్పున విడుదల చేస్తున్న నిధులను ఒకే విడతగా ఇవ్వాలన్న ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. à°ˆ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేస్తున్నందున ఏపీని ప్రత్యేకంగా చూడలేమని కేంద్రం సృష్టం చేసింది. మంగళవారం పార్లమెంట్‌లో à°ˆ అంశంపై ప్రస్తావన వచ్చినప్పుడు.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. కేంద్రం మూడు విడతలుగా పీఎం కిసాన్‌ పథకాన్ని అమలు చేస్తుండగా, à°† పథకంతో లింక్‌ పెట్టిన ఏపీ ప్రభుత్వం కూడా మూడు విడతలుగానే వైఎ్‌సఆర్‌ రైతుభరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కానీ కేంద్రం నిధుల్ని మాత్రం ఒకే సారి ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేస్తున్న పథకానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని లింక్‌ పెట్టి, ఏక మొత్తంగా నిధుల విడుదల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపి అభాసుపాలు కావాల్సి వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నారు. వాస్తవంగా పీఎం కిసాన్‌తో కలిసి వైఎ్‌సఆర్‌ భరోసా పథకాన్ని అమలు చేస్తున్న వ్యవసాయశాఖ నుంచి కాకుండా ఆర్థికశాఖ నుంచి కేంద్రానికి à°ˆ ప్రతిపాదన వెళ్లినట్లు సమాచారం.  వైఎ్‌సఆర్‌ రైతుభరోసా పథకం à°•à°¿à°‚à°¦ ఏటా రూ.12,500 చొప్పున ఐదేళ్లపాటు నేరుగా భూమి యజమానులు, కౌలురైతులకు పెట్టుబడిసాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వైసీపీ... అధికారంలోకి వచ్చాక à°ˆ పథకాన్ని ుపీఎం కిసాన్‌్‌కు లింక్‌ పెట్టింది. పథకానికి ువైఎ్‌సఆర్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌్‌ అనే పేరు పెట్టారు. పీఎం కిసాన్‌ à°•à°¿à°‚à°¦ కేంద్రం ఇచ్చే రూ.6వేలతో పాటు ఏపీ ప్రభుత్వం రూ.7,500 ఇవ్వాలని నిర్ణయించింది.

 

కేంద్రం కౌలు రైతులకు సాయం అందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించింది. పైగా à°ˆ మొత్తాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2020 ఖరీ్‌ఫలో తొలి విడత పెట్టుబడి సాయం అందిస్తామన్న ప్రభుత్వం à°—à°¤ రబీ సీజన్‌లోనే పథకాన్ని అమలులోకి తెచ్చింది. కానీ à°ˆ పథకానికి అనేక నిబంధనలు పెట్టి, భూ యజమానులకు రూ.7,500, కౌలు రైతులకు రూ. 13,500 చొప్పున à°—à°¤ అక్టోబరులో లబ్ధిదారుల à°–à°¾ తాలకు జమ చేసింది. వాస్తవంగా రాష్ట్రంలో రూ.53లక్షల మంది రైతులు, 15.37లక్షల కౌలు రైతులు ఉన్న ట్లు వ్యవసాయశాఖ అంచనా వేసినా... రైతుభరోసాకు పెట్టిన నిబంధనలతో à°—à°¤ అక్టోబరులో  కేవలం 45లక్షల మంది భూ యజమానులకే పెట్టుబడి సా యం రూ.7,500 చొప్పున అందించారు. కౌలు రైతుల్లో 1.40లక్షల మందికే సాయం అందింది. అలాగే 2015- 16 వ్యవసాయ గణాంకాల ప్రకారం ఏపీలో 54.45 లక్షల మంది భూయజమానులు ఉండగా, రాష్ట్రంలో 31.33 లక్షలమందికే ుపీఎం-కిసాన్‌్‌ అందుతోంది.