చంద్రబాబును ఇంచు కూడా కదలనివ్వం

Published: Thursday February 20, 2020

 à°°à±ˆà°¤à±à°² ముసుగులో టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా ఆరోపించారు. తనపై దాడికి చంద్రబాబు కుట్ర పన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏను ‘చంద్రబాబు రిలేషన్స్‌ దోపిడీ ఏజెన్సీ’à°—à°¾ మార్చారన్నారు. సీఆర్డీఏ పేరుతో పచ్చటి పొలాలను నాశనం చేశారని విమర్శించారు. 4 వేల ఎకరాలకు పైగా దోచుకున్నారన్నారు. ప్రజారాజధాని పేరుతో à°“ సామాజిక వర్గానికి చెందిన రాజధాని కట్టారన్నారు. చంద్రబాబును నమ్మి కుప్పం ప్రజలు నష్టపోయారన్నారు. à°“ ప్రాంతమే అభివృద్ధి చెందాలని ఎందుకు ఆలోచిస్తున్నారన్నారు. 13 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారని.. వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం లేదా అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానులని.. ఎవరిపైనో కుట్ర.. కక్షతో కాదన్నారు. చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల దొరికాయన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 

 

ఎమ్మెల్యేలపై దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని టీడీపీ అధినేతను హెచ్చరించారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజాచైతన్యయాత్ర ఇంచు కూడా కదలకుండా చేస్తామన్నారు. చంద్రబాబు డ్రామాలు కట్టిపెట్టకుంటే తగిన శాస్తి జరుగుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన హైదరాబాద్‌ ఇంటికి ఒక్కరిని రానివ్వలేదని.. ఎందుకు సీక్రెట్‌à°—à°¾ ఉంచుతున్నారని ప్రశ్నించారు. ఎవరికెన్ని ఆస్తులున్నాయో.. అఫిడవిట్ చూస్తే తెలుస్తుందన్నారు. ప్రతి సంవత్సరం కొత్తగా ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు. à°ˆ రోజుల్లో ప్రజలను మాయ చేయడం కుదరదన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించాలన్నారు. రాజధాని పేరుతో దోచుకున్నారు కాబట్టే.. లోకేశ్‌ను చిత్తుగా à°“à°¡à°¿à°‚à°šà°¿ బుద్ధిచెప్పారని విమర్శించారు. అవినీతి సామ్రాజ్యం కూలిపోతుందన్న బాధతోనే దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్‌ రైతులకు ప్యాకేజీ పెంచారని.. రైతులకు మద్దతుగా ఉన్నారన్నారు. 

 

అంతకుముందు రోజాకు రాజధాని సెగ తగిలింది. గురువారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. విషయం తెలిసిన రాజధాని రైతులు, మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఆమె కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆమె కాన్వాయ్‌ను అక్కడి నుంచి బయటకు పంపారు.