ఎవరికైనా శిక్ష తప్పదు: బొత్స

Published: Sunday February 23, 2020

‘‘తప్పుచేసేవారు ఎవరైనా, ఎంతటివారైనా శిక్ష అనుభవిస్తారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని తొలి నుంచి చెప్తున్నాం. ప్రతిపక్ష నాయకులు ఎటువంటి విచారణకైనా సిద్ధమంటున్నారనే తొలుత ఉప సంఘం ఇప్పుడు సిట్‌ వేశాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై విజయనగరంలో అధికారులతో శనివారం సమీక్షించిన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని గవర్నర్‌ దృష్టికి కూడా తీసుకు వెళ్లామన్నారు. సిట్‌ దర్యాప్తు వేస్తే కక్ష సాధింపు అని ఎలా అంటారని ప్రశ్నించారు. బీసీలే లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం కక్షపూరితంగా వహరిస్తున్నదంటూ అసత్యప్రచారం చేయడం దారుణమన్నారు. సీఎం పేషీలో ఉండే పీఎ్‌సపై ఆదాయపన్ను వారు విచారణ చేయడం ఇదే ప్రథమమని అన్నారు. సీపీఐ జాతీయ నేత రాజాకు అమరావతి భూములపై వినతిపత్రం అందజేసిన జేఏసీ నేతల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే ఉన్నారని ఆరోపించారు.