బయటపడిన వైసీపీ నేతల బండారం.

Published: Thursday February 27, 2020

గ్రామ వలంటీర్లుగా ఉద్యోగాలు పొందిన విద్యార్థుల గుట్టు రట్టయింది. ‘జగనన్న వసతి దీవెన’లో లబ్ధి పొందాలని ప్రయత్నించిన వారి బండారం బయటపడింది. à°ˆ పథకం ద్వారా ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ వారికి రూ.15వేలు, ఆపై కోర్సులు చదివేవారికి రూ.20వేలు వసతి, భోజన ఖర్చుల à°•à°¿à°‚à°¦ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడత చెల్లింపు ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే వలంటీర్లుగా చేరి పలు గ్రామ, వార్డుల్లో విధులు నిర్వహిస్తున్న పలువురు విద్యార్థులు ప్రతినెలా రూ.5వేలు గౌరవ వేతనం అందుకుంటున్నారు.

 

వీరు ఇప్పుడు à°ˆ పథకం à°•à°¿à°‚à°¦ కూడా లబ్ధి పొందడానికి బయోమెట్రిక్‌లో వేలు పెట్టడంతో అసలువిషయం బయటపడింది. ఇప్పటికే వీరంతా వలంటీర్లుగా ఉద్యోగం చేస్తున్నారని తేటతెల్లమైంది. ఈనెల 24నుంచి విద్యాదీవెన, వసతి దీవెన కార్డులు పంపిణీ చేస్తున్నారు. వీటిని తీసుకునే క్రమంలో విద్యార్థులు బయోమెట్రిక్‌లో వేలిముద్రలు వేయాలి. వలంటీర్లుగా నియమితులైన సందర్భంలో వీరి వేలిముద్రలు ఆధార్‌తో లింక్‌ చేశారు. కార్డు కోసం వేలిముద్ర వేయగానే వీరి మొత్తం వ్యక్తిగత వివరాలు, వలంటీరు అనే విషయంతో సహా తెలిసిపోయింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం లో 45మంది విద్యార్థులు వలంటీర్లుగా పని చేస్తున్నట్లు తేలింది. జలదంకి మండలంలో ఇలాంటివారు పదిమంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. 

 

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5లక్షల మంది వలంటీర్లను నియమించింది. నిబంధనల ప్రకారం నిరుద్యోగులైన విద్యావంతులతో మాత్రమే ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఈ నియమాకాలు పూర్తిగా అధికార పార్టీ నేతల అభీష్ఠం మేరకే జరిగాయని, అధికారుల పాత్ర నామమాత్రంగా మిగిలిందనే ఆరోపణలొచ్చాయి. పోస్టులన్నీ తమవారికే దక్కాలన్న ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తలు, గ్రామ, వార్డు స్థాయి నేతలు తమ పిల్లలు కళాశాలల్లో చదువుతున్నప్పటికీ ఈ ఉద్యోగాల్లో చేర్పించారు. ఇందుకోసం భారీగా పైరవీలు చేసుకున్నారు. బయటివారికి అవకాశమివ్వకుండా తమ పిల్లల్నే వలంటీర్లుగా నియమించుకునేలా పావులు కదిపారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో పలుచోట్ల విద్యార్థులను వలంటీర్ల పోస్టుల నుంచి తొలగించారు. అయినా కొన్నిచోట్ల ఇంకా విద్యార్థులు పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారు.