రాష్ట్రంలో కరోనా విజృంభణ

Published: Monday June 08, 2020

రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 199 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 130 మంది రాష్ట్రంలోని వారు కాగా, 69మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారున్నారు. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 4,659à°•à°¿ పెరిగాయి. వీటిలో 3,718 మంది రాష్ట్రంలోనివారికి, విదేశాల నుంచి వచ్చిన 131మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 810మందికి వైరస్‌ సోకింది. కరోనా బారిన పడి కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ నిర్ధారించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 75కు చేరాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో అటెండర్‌తో పాటు ఎలక్ట్రీషియన్‌కు కరోనా సోకింది. దీంతో ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. à°•à°¡à°ª జిల్లాలో ఒక్కరోజే 32కేసులు నమోదయ్యాయి. వీరిలో మైలవరం మండలం నవాబుపేటలోనే 26 మంది ఉన్నారని వైద్యఆరోగ్య శాఖ జిల్లా అధికారిణి ఉమాసుందరి తెలిపారు.

 

పశ్చిమగోదావరి జిల్లాలో మరో 27మంది కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ ఆస్పత్రికి చెందిన à°’à°• స్టాఫ్‌నర్సుకు పాజిటివ్‌ వచ్చింది. కృష్ణాజిల్లాలో కొత్తగా 25మందికి వైరస్‌ సోకింది. నెల్లూరు జిల్లాలో మరో 22కేసులు నమోదయ్యాయి. వీరిలో 9మంది వలస కార్మికులున్నారు. కర్నూలు జిల్లాలో మరో 10మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటితో కలిపి à°ˆ జిల్లాలో కేసుల సంఖ్య 772కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో 7కేసులు వెలుగు చూశాయి. వీరిలో రాయవరం, అన్నవరం మండలాల్లో ముగ్గురు చొప్పున, బొమ్మూరు క్వారంటైన్‌ సెంటర్లో ఒకరు ఉన్నారు. గుంటూరులోని జిల్లాకోర్టులో తోటమాలికి, నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో à°“ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ వచ్చింది. విజయనగరం జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంటున్న ముగ్గురికి వైరస్‌ నిర్ధారణ అయింది. విశాఖ జిల్లాలో మరో 15మంది వైరస్‌ బారిన పడ్డారు. వీటితో కలిపి à°ˆ జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 179à°•à°¿ చేరింది. ఇదిలాఉండగా, తిరుపతిలో ఆదివారం à°“ వృద్ధురాలు(70) కరోనాతో మృతి చెందారు. తీవ్ర శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబీకులు రుయాస్పత్రి క్యాజువాలిటీకి చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ట్రూనాట్‌ ద్వారా పరీక్ష చేయగా కరోనా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.