భేదాల్ని వివాదాలుగా మారనివ్వం చైనా

Published: Tuesday June 09, 2020

సరిహద్దు సమస్యల పరిష్కారం విషయంలో భారత్‌, చైనాలు తమ మధ్య భేదాల్ని వివాదాలుగా మారకుండా చూడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చాయని చైనా వెల్లడించింది. à°ˆ నెల 6à°¨ తూర్పు లద్ధాఖ్‌లోని చుసుల్‌ మోల్డో ప్రాంతంలో భారత్‌, చైనాల మధ్య 5à°—à°‚à°Ÿà°² పాటు చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. à°† భేటీ సారాంశాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. అయితే.. ఓవైపు శాంతికాముక వ్యాఖ్యలు చేస్తూనే.. సరిహద్దుల్లో తన సైనిక బలాన్ని చూపించే విన్యాసాలను చైనా కొనసాగిస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి చైనా హెలికాప్టర్ల కదలికలు ఎక్కువయ్యాయని భారత ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి.

 

నియంత్రణ రేఖ దాటి మరీ.. గాల్వన్‌ ప్రాంతంలో భారత్‌ నిర్మిస్తున్న రోడ్డును అవి పరిశీలించినట్లు తెలుస్తోంది. భారత సైన్యం వెంటనే యుద్ధవిమానాలను గస్తీకి దింపినట్లు సమాచారం. మహాదళపతి బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ అయ్యారు. తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది. చైనాతో చర్చలు ఆశావహంగా ఉన్నాయని.. మున్ముందు వాటిని కొనసాగిస్తామన్నారు. రాహుల్‌ గాంధీ విమర్శలపై స్పందిస్తూ.. రక్షణమంత్రిగా పార్లమెంటులోనే సమాధానం చెబుతానన్నారు.

 

భారత్‌, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ ఎయిర్‌ మార్షల్‌ పీకే బార్బొరా 2008నాటి ఘటన గురించి à°“  ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.  తాను వైమానిక దళం వైస్‌ చీఫ్‌à°—à°¾ ఉన్నప్పుడు.. లద్దాఖ్‌లోని దౌలత్‌బేగ్‌ ఓల్డీ ఎయిర్‌ స్ట్రిప్‌లో అనుమతి లేకుండానే ల్యాండై, తిరిగి వచ్చేశానన్నారు. దీనిపై చైనా భారత్‌ను చర్చించేందుకుపిలిచి, మళ్లీ స్పందించలే దన్నారు.