ఏటీఎంలకు నగదు తరలించే వాహనంలో 39 లక్షల అపహరణ

Published: Wednesday June 10, 2020

బ్యాంకు ఎదుట ఆపి ఉన్న ఏటీఎంలకు నగదు తరలించే వాహనంలో చోరీ జరిగిన ఘటన గుంటూరులో మం గళవారం చోటుచేసుకుంది. à°ˆ చోరీలో రూ.39 లక్షలు అపహరణకు గురయ్యాయి. à°ˆ మేరకు రైటర్‌ సేఫ్‌ ఏజెన్సీ సంస్థ నల్లపాడు పోలీసులకు à°«à°¿ ర్యాదు చేసింది. à°† సంస్థ తన వాహనంలో లక్ష్మీపురంలోని ఆంధ్రాబ్యాంక్‌, జిన్నాటవర్‌ సెంటర్‌లోని కరూర్‌ వైశ్యాబ్యాంక్‌, మార్కెట్‌ సెంటర్‌లోని కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి 39 లక్షల నగదును సేకరించింది. నగరాలులోని సెంట్రల్‌ బ్యాంక్‌లో 17 లక్షలు నగదు తీసుకున్నారు. అనంతరం వాహనాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద ఆపిన సిబ్బంది నలుగురిలో ఇద్దరు బ్యాంక్‌లోకి వెళ్లారు. గన్‌మెన్‌ పక్కనే ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు. మరో వ్యక్తి à°Ÿà±€ తా గేందుకు వెళ్లాడు. కొద్ది సేపటికి బ్యాంక్‌లోకి వెళ్లిన ఇద్దరు వాహనం వద్దకు వచ్చి చూడగా తాళం పగలకొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని గ్రహిం à°šà°¿ గట్టిగా కేకలు వేశారు. సమాచారం అందుకున్న నల్లపాడు సీఐ విచారణ చేపట్టారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. అయితే వాహనం తాళాలు పగలకొట్టి గందరగోళం జరిగినట్లు తాము గుర్తించలేదని స్థానికులు తెలిపారు. దీంతో వాహనంలో ఉన్న భుజంగరావు, తిరుమలరావు, వెంకట నాగేంద్ర, ప్రవీణ్‌ కుమార్‌లే à°ˆ దొంగతనం చేసి ఉండొచ్చన్న అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాహనం సీసీ కెమెరాలు లేని చోట నిలపడం, నలుగురూ వాహనాన్ని వదిలి ఒకేసారి వెళ్లడం, నంబర్‌ లాక్‌ వేసి ఉన్న డోర్‌ పగలకొట్టకుండానే తెరుచుకోవడం లాంటి పరిస్థితులను బట్టి సిబ్బంది హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.