నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో భారీ వర్షాలు

Published: Wednesday June 10, 2020

నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం à°“ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గుంటూరు జిల్లాలో మధ్యాహ్నం 3 à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి పది à°—à°‚à°Ÿà°² వరకూ ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. భట్టిప్రోలులో అత్యధికంగా 94.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు నగరంతో పాటు డెల్టా అంతా వర్షం కురిసింది. పల్నాడులో రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు మిర్చియార్డులో మిరపకాయల బస్తాలు తడిసిపోయాయి.  శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో సోమవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి, à°…à°°à°Ÿà°¿ చెట్లు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. సోమవారం రాత్రి 7 à°—à°‚à°Ÿà°²  నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం, విజయవాడల్లో చిరుజల్లులు పడ్డాయి. కైకలూరు, జగ్గయ్యపేట, విజయవాడ, కలిదిండి,  గుడ్లవల్లేరు, పెడన, కృత్తివెన్ను తదితర ప్రాంతాల్లో  à°’à°• మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.