ఏపీలో రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు

Published: Thursday June 11, 2020

 à°à°ªà±€à°²à±‹ వచ్చే రెండు రోజుల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో సాధారణం కంటే అధిక వర్షాలు పడుతామని అధికారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు అల్లకల్లోలంగా తీర ప్రాంతం ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి బలపడనున్నది. అల్పపీడనం, నైరుతి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్ర, రాయలసీమల్లో à°“ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.