కరోనా రోగులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు

Published: Friday June 12, 2020

కరోనా రోగులకు చికిత్స, వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే తీరుపై ఢిల్లీ సర్కార్‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడుతూ... తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆస్పత్రుల నిర్వహణ ఏమాత్రం బాగోలేదని మండిపడింది. ఢిల్లీలో కరోనా రోగుల పట్ల జంతువుల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడింది. ఆస్పత్రుల్లో కోవిడ్ మృతదేహాల నిర్వహణ ఏమాత్రం సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

 

‘‘కరోనా మృతదేహాలపై ఏమాత్రం శ్రద్ధ లేదు. వారి వారి కుటుంబీకులకు కూడా కనీసం సమాచారం ఇవ్వడం లేదు. కొన్ని కేసుల్లో అయితే వారి కర్మ కాండలకు కూడా కుటుంబీకులు హాజరు కాలేకపోతున్నారు.’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఆస్పత్రుల్లో కరోనా మృతదేహాలను ఉంచడంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వ్యాఖ్యానించింది.