సెంట్రల్‌ జైల్లో ఖైదీకి వైరస్‌

Published: Friday June 19, 2020

కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 425 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 299మంది రాష్ట్రంలోని వారే కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 100మందికి, విదేశాల నుంచి వచ్చిన 26మందికి వ్యాధి సంక్రమించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 7,496à°•à°¿ పెరిగిపోయాయి. తాజాగా 77మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2,983 మంది డిశ్చార్జి కాగా 2,779 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

గురువారం కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 92కు చేరాయి. కర్నూలు జిల్లాలో ఒక్కరోజే 74కేసులు నమోదయ్యాయి. ఇందులో జిల్లావాసులు 50మంది, ముంబై వలస కార్మికులు 23మంది, తెలంగాణకు చెందిన ఒకరు ఉన్నారు. వీటితో జిల్లాలో కేసుల సంఖ్య 1194కు చేరింది. కొత్తగా ఆదోని మున్సిపాలిటీలో 35, ఆదోని రూరల్‌లో 6, కర్నూలులో 6 కేసులు వెలుగు చూశాయి.

 

అనంతపురం జిల్లాలో మరో 47మంది కరోనా బారినపడ్డారు. అనంతపురంలోని à°“ రెవెన్యూ ఉద్యోగికి, అనంతపురం పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో పనిచేసే అధికారికి వైరస్‌ సోకినట్లు సమాచారం. à°•à°¡à°ª జిల్లాలో మరో 36 కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రొద్దుటూరులోని నడింపల్లె కంటైన్మెంట్‌ జోన్‌లో 16, నవాబుపేటలో 7, కడపలో 8 కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మరో 30కేసులు నమోదయ్యాయి. విజయవాడలో 22, మచిలీపట్నం, ఉయ్యూరు, ఊటుకూరు తదితర ప్రాంతాల్లో మరో 8మందికి వ్యాధి సోకింది. శ్రీకాకుళం జిల్లా మందసలో à°“ వ్యక్తి కరోనాతో చనిపోగా, ఆయన కుటుంబ సభ్యుల్లో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది.

 

చిత్తూరు జిల్లాలో మరో 57 కేసులు నమోదయ్యాయి. తిరుపతి రూరల్‌ మండలంలో ఒకే కుటుంబంలో 13 కేసులు వెలుగు చూశాయి. విశాఖపట్నంలో 25 కొత్త కేసులు వచ్చాయి. మరో 4కేసులు నిర్ధారించాల్సి ఉంది. మూలపాలెం ప్రాంతంలో మరో 18మందికి పాజిటివ్‌ అని తేలింది. సీతమ్మధార ప్రాంతంలో యువ దంపతులకు కరోనా వచ్చింది. సిరిపురంలో వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో à°’à°•à°°à°¿à°•à°¿ వైరస్‌ సోకింది. విజయనగరం జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. చింతలవలస ఐదో బెటాలియన్‌కు చెందిన à°’à°• పోలీసు ఉద్యోగికి కరోనా సోకింది. ప్రకాశం జిల్లాలో 38, పశ్చిమ గోదావరి జిల్లాలో 64 కొత్త కేసులు నమోదయ్యాయి.