ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

Published: Saturday June 20, 2020

 à°à°ªà±€à°²à±‹ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామన్నారు. విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు.

 

దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.

 

ఏపీలో కరోనా విజృభిస్తోంది. కరోనా కేసులు రోజుకు 500లకుపైగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. అత్యధికంగా మరణాలు కూడా à°ˆ జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. à°ˆ నేపథ్యంలో అటు తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతుండటంతో ఏపీ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీడీపీ, జనసేనతో పాటు పలు ప్రజాసంఘాలు పదో తరగతి పరీక్షలు రద్దుచేయాలని డిమాండ్ చేశాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయపార్టీల డిమాండ్లతో ప్రభుత్వానికి రద్దు చేయకతప్పలేదు. 

 

ఇదిలావుంటే వచ్చే నెలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని గతంలో మంత్రి సురేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యార్థులు మొత్తం 11 పేపర్లు రాయాల్సి ఉండగా వాటిని కేవలం ఆరు పేపర్లకు కుదిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నింబంధన ఈ సంవత్సరంలో పరీక్షులు రాసే రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మాత్రమే పేపర్లు కుదింపు ఉంటుందని వచ్చే ఏడాది నుంచి 11 పేపర్లు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.