ఇసుక సరఫరాలో లోపాలు వెలుగులోకి

Published: Saturday June 20, 2020

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం భట్నవిల్లి సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇల్లు కట్టుకొంటున్నారు. ఏపీఎండీసీ అధికారులు నాలుగు లారీల ఇసుకను ఆయన ఇంటి కోసం తరలించారు. à°† ఇసుకను చూస్తే ఎవరైనా కంగు తినాల్సిందే! అందులో ఇసుక కన్నా తువ్వ, మట్టే ఎక్కువగా ఉంది. వివరాల్లోకి వెళితే.. నిర్మాణంలో ఉన్న మంత్రి విశ్వరూప్‌ ఇంట్లో కాంక్రీటు పనుల కోసం పదిరోజుల క్రితం à°“ వ్యక్తి పేరిట ఇసుకను ములకల్లంక ర్యాంపు నుంచి బుక్‌ చేసుకున్నారు. వారికి రెండురోజుల్లో తువ్వ, మట్టితో కూడిన నాలుగు లారీల ఇసుక సరఫరా అయింది.

 

దీనిపై అమరావతిలో ఉన్న మంత్రి విశ్వరూ్‌పకు స్థానికంగా పనులు చేస్తున్న నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. ఇసుక సరఫరాలో లోపాలను కలెక్టర్‌ దృష్టికి మంత్రి తీసుకువెళ్లారు. శుక్రవారం ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌ వెళ్లి.. ఇసుక గుట్టలను పరిశీలించారు. à°† ఇసుక ఎటువంటి నిర్మాణాలకూ పనికిరాదని, కేవలం పునాదుల్లో వేయడానికి ఉపయోగపడుతుందని తేల్చి.. అదే విషయం కలెక్టర్‌కు నివేదించారు. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ ప్రారంభించారు. కాగా, సామాన్యులకు కూడా మూడు నెలల నుంచి ఇదే తరహాలో పనికిరాని ఇసుకను ఏపీఎండీసీ అధికారులు సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు మంత్రి దాకా à°† సమస్య రావడంతో అధికార యంత్రాంగం సరఫరాలో లోపాలను గుర్తించే పనిలో నిమగ్నమయింది.