45 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు దేశంలో ఎమర్జెన్సీ

Published: Thursday June 25, 2020

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూ ‘ఎమర్జెన్సీ’ సమయంలో పోరాడుతూ అసువులు బాసిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని గురువారం ట్వీట్ చేశారు. ‘‘45 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు దేశంలో ఎమర్జెన్సీని విధించారు. à°† సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటం చేసిన వారికి వందనం చేస్తున్నాను. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదు’’ అంటూ ట్వీట్ చేశారు.ఇందిరా గాంధీ 1975 జూన్ 25 à°¨ దేశంలో అత్యయిక పరిస్థితిని విధించిన విషయం తెలిసిందే.

 

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌à°·à°¾ కూడా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. 45 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు à°“ కుటుంబం అధికార దాహంతో దేశంలో ఎమర్జెన్సీ విధించిందని à°·à°¾ గుర్తు చేశారు. దీంతో రాత్రికి రాత్రే దేశం జైలులా మారిందని చెప్పారు. మీడియాను, న్యాయస్థానాలను అణచివేశారని, భావ ప్రకటిత స్వేచ్ఛను తొక్కేశారని à°·à°¾ తెలిపారు. లక్షలాది మంది ప్రజల ఉద్యమం కారణంగా ఎమర్జెన్సీ ఎత్తివేశారని à°·à°¾ గుర్తు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడిందని, అయితే కాంగ్రెస్ కనుమరుగైందని à°·à°¾ చెప్పారు.