అపోలో టైర్స్‌ ఉత్పత్తి ప్రారంభం

Published: Saturday June 27, 2020

 à°šà°¿à°¤à±à°¤à±‚రు జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్న పాండూరు వద్ద నెలకొల్పిన ప్రతిష్టాత్మక అపోలో టైర్స్‌ కంపెనీ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైంది. కంపెనీ ఛైర్మన్‌ ఓంకార్‌ కన్వర్‌, వైస్‌ ఛైర్మన్‌, à°Žà°‚à°¡à±€ నీరజ్‌ కన్వర్‌ తదితరులు కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉత్పత్తిని ప్రారంభించారు. à°—à°¤ ప్రభుత్వంలో 2018 జనవరి 9à°µ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు à°ˆ ప్లాంటుకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.1800 కోట్ల పెట్టుబడితో మొదలైన à°ˆ ప్లాంటు రానున్న ఏడాదిన్నర వ్యవధిలో రూ.3800 కోట్ల పెట్టుబడితో పూర్తిస్థాయి ఉత్పత్తి స్థాయికి చేరుకోనుంది.

 

డిమాండ్‌ మేరకు రోజుకు 15,000 ప్యాసింజర్‌ కార్ల టైర్లు, 3 వేలు ట్రక్‌, బస్సు రేడియల్స్‌ ఉత్పత్తి చేయనుంది.  కాగా.. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తెచ్చేందుకు తమ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి ఫలించిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. 2018 సంవత్సరంలో ఏర్పాటైన అపోలో టైర్స్‌ పరిశ్రమ శుక్రవారం నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తోందని ఆయన à°’à°• ట్వీట్‌లో తెలిపారు. ‘ఏపీ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలన్న తపనతో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తేవడానికి మేం కృషి చేశాం. à°ˆ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించడం ఆనందంగా ఉంది’ అని ఆయన అన్నారు.