. అచ్చెన్న ఆరోగ్యంపై టీడీపీ ఆరా

Published: Sunday June 28, 2020

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జీజీహెచ్‌లో కరోనా వ్యాప్తి చెందుతుండటమే దీనికి కారణం. ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆయనకు à°—à°¤ కొన్నిరోజులుగా అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వైద్య సిబ్బంది కరోనా అన్న వార్తలతో  టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. జీజీహెచ్‌కు చేరుకుంటున్న టీడీపీ నేతలు.. ఆయన ఆరోగ్య పరిస్థితి వాకబు చేస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. à°®à°°à±‹à°µà±ˆà°ªà± అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆయనకు బీపీ పెరిగి, షుగర్‌ లెవల్స్‌ తగ్గిపోయాయి. నిన్నటి వరకు ఆయన నడుమునొప్పితో కూడా బాధపడ్డారు. à°“ వైపు కరోనా కేసుల భయం.. మరోవైపు ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.