జగన్ పేరు బయటపెట్టిన పట్టాభి

Published: Sunday June 28, 2020

సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌ వ్యవహారంలో జగన్ సర్కార్ ఇష్టానుసారం వ్యవహరించిందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. గతంలో చేసిన నీటి కేటాయింపుల కంటే ఎక్కువ కేటాయింపులు జరపుకున్నారన్నారు. ఐదేళ్ల కాలపరిమితి కాస్తా.. జీవితకాలానికి మార్చుకున్నారని పట్టాభి అన్నారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో వైఎస్ జగన్, భారతికి భాగస్వామ్యం ఉందన్న ఆయన.. ఇదే విషయమాన్ని అఫిడవిట్‌లో పొందుపర్చారన్నారు. గుంటూరు జిల్లాలో లైమ్ స్టోన్‌ కోసం ఈ కంపెనీకి భూములు ఇచ్చారని... అప్పటి ఐఏఎస్ శ్రీలక్ష్మి కేటాయింపులు జరిపారన్నారు. అయితే సకాలంలో పనులు ప్రారంభించకపోవడంతో లీజు రద్దు అయ్యిందన్నారు. అయితే గతేడాది రెన్యువల్ చేయించుకోవడానికి పర్యావరణ బోర్డును అనుమతి కోరారన్నారు. ఈ క్రమంలో పర్యావరణ బోర్డులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తమ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయన్నారు. జీవోలతో సహా అన్నిటికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఇష్టానుసారం జీవోలు మార్చుకున్నారని .. వీటిపై ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.