జీజీహెచ్ నుంచి అచ్చెన్న డిశ్చార్జ్..

Published: Wednesday July 01, 2020

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈఎస్‌ఐ స్కాంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నను.. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఇప్పటికే మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అచ్చెన్న రిమాండ్ గడువును ఏసీబీ కోర్టు పొడిగించింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.  ఇప్పుడు ఆస్పత్రి అధికారులు సడెన్‌à°—à°¾ డిశ్చార్జి చేశారు. దీంతో అచ్చెన్నను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంగా ఉన్న అచ్చెన్నపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. 

 

మరోవైపు అచ్చెన్నాయుడు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. తనకు కరోనా టెస్ట్ చేయాలని కోరారు. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదని, కరోనా పరీక్ష చేయకుండా జైలు అధికారులు అనుమతించరని తెలిపారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే డిశ్చార్జ్ చేయాలని లేఖలో అచ్చెన్న విజ్ఞప్తి చేశారు. 

 

అటు అచ్చెన్న బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అచ్చెన్నాయుడు తరపున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించనున్నారు.