ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్

Published: Thursday July 02, 2020

 à°šà±ˆà°¨à°¾à°¤à±‹ ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకుని చేసిన విక్టరీ డే ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై అభినందనలు తెలిపారు.  అదే సమయంలో మరో 16 సంవత్సరాల పాటు పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా ఉండేలా తాజాగా చేసిన రాజ్యాంగ సవరణ ఆమోదం పొందడంపై కూడా మోదీ పుతిన్‌కు కంగ్రాట్స్ చెప్పారు. మాస్కోలో ఇటీవల జరిగిన మిలిటరీ పరేడ్‌లో భారత త్రివిధ దళాలు పాల్గొన్న విషయంపై ఇద్దరు నేతలూ మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పటిష్టమైన బంధానికిది నిదర్శనమన్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరస్పరం à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక సమావేశానికి రావాలని ప్రధాని మోదీ పుతిన్‌కు ఆహ్వానం పలికారు.

 

తనకు ఫోన్ చేసి అభినందనలు తెలపడంపై పుతిన్ మోదీకి ధన్యవాదాలు చెప్పారు. భారత్‌కు తామెప్పుడూ à°…à°‚à°¡à°—à°¾ ఉంటామని స్పష్టం చేశారు. 2036 వరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. 83 ఏళ్ల వయసు వచ్చేవరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉంటారు. మరోవైపు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి రష్యా నుంచి 33 యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి.