టిక్‌టాక్ బ్యాన్ ఎఫెక్ట్..

Published: Sunday July 05, 2020

చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన తర్వాత భారత ఇంటర్నెట్ కంపెనీల పంట పండింది. గురుగ్రామ్‌కు చెందిన వీడియో షేరింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘రోపోసో’ అయితే డౌన్‌లోడ్లలో దూసుకుపోతోంది. చైనా యాప్‌లను నిషేధించిన రెండు రోజుల్లోనే ఏకంగా 22 మిలియన్ల మంది à°ˆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2014లో à°ˆ యాప్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం 12 భాషల్లో అందుబాటులో ఉంది. నెలకు 80 వేలకు పైగా వీడియోలు క్రియేట్ అవుతున్నాయి. చైనా యాప్‌à°² నిషేధం తర్వాత గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ ట్రెండింగ్ అప్లికేషన్లలో à°’à°•à°Ÿà°¿à°—à°¾ నిలించింది. 

 

à°—à°¤ మూడు వారాలుగా రోపోసో యాప్ రోజుకు ఏడు లక్షల మంది ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. à°—à°¤ మూడు రోజులుగా అయితే ఇది మరింత పెరిగింది. ప్రస్తుతం సగటును గంటలకు ఆరు లక్షల ఇన్‌స్టాళ్లు అవుతున్నట్టు రోపోసో సహ వ్యవస్థాపకుడు, సీఈవో మయాంక్ భంగాడియా తెలిపారు. రోపోసోతో పాటు ఇతర ఇండియన్ యాప్స్ అయిన షేర్‌చాట్, చింగారీ, మిత్రోన్‌ తదితర వాటి డౌన్‌లోడ్లు కూడా బాగా పెరిగాయి.