వెనక్కి మళ్లిన చైనా బలగాలు

Published: Monday July 06, 2020

చైనా బలగాలు వెనక్కి మళ్లాయి. గల్వాన్, గోగ్రా నుంచి చైనా బలగాలు తిరుగుముఖం పట్టాయి. టెంట్లు తొలగించడంతో పాటు తమ వాహనాలను కూడా వెనక్కు తీసుకువెడుతున్నాయి. కమాండర్ స్థాయి చర్చల్లో నిర్ణయించుకున్నట్లుగానే చైనా బలగాలు వెనక్కు పయనమయ్యాయి. రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్తున్నాయి.

 

జూన్ 15à°¨ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చైనా యాప్‌లను నిషేధించడంతో పాటు చైనాతో వాణిజ్య కార్యకలాపాలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు స్వయంగా ప్రధాని మోదీ లడక్‌లో పర్యటించి సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని పెంచారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఒత్తిడితో చైనా వెనకడుగు వేసినట్లు సమాచారం.