క్రిమినల్ దూబే చిక్కాడు...

Published: Thursday July 09, 2020

మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే అరెస్టైన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉజ్జయినీ మహాకాళిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈయనను పట్టించిన వారికి 5 లక్షల రూపాయల రివార్డును అందిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి à°ˆ ఐదు లక్షలు ఎవరికి దక్కుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న. నేరుగా యూపీ పోలీసుల చేతికి చిక్కితే మాత్రం ఎన్‌కౌంటర్ చేసేసేవారు. కానీ à°† క్రిమినల్ పోలీసుల కళ్లు కప్పి ఉజ్జయినికి వెళ్లిపోయాడు.

 

à°ˆ సందర్భంలో ఐదు లక్షల రివార్డును అందుకునే వారి క్యూ కాస్త పెద్దగానే ఉంది. à°† క్యూలో ముందుగా ఉన్నవారు మహాకాల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. మహాకాళి మందిరం వద్దే కదా à°† క్రిమినల్‌ని అరెస్టు చేసింది. అందుకే వారు ముందు వరుసలో ఉన్నారు.

 

ఇక వరుస క్రమంలో రెండోవారు మహాకాళి ఆలయ సెక్యూరిటీ గార్డులు. ఉజ్జయినీ ఆలయం దగ్గర అనుమానాస్పదంగా దూబే తిరుగుతున్న సమయంలో తాము గుర్తించామని, ఆయన ఐడెంటిటీ కార్డును అడిగామని ఓ గార్డు పేర్కొన్నారు. ఆయన తిరస్కరించడంతో అక్కడే ఉన్న పోలీసులను పిలిచామని, వెంటనే పోలీసులు దూబేను అరెస్ట్ చేశారని ఆయన వెల్లడించారు.

 

ఇక మూడో వ్యక్తి... ఆలయ పూజారి. ఆయన మాట్లాడుతూ... దూబే ఆలయానికి వచ్చి పూజాదికాలు చేశాడని, అయితే తాము పూజలో ఉన్న సమయంలో ఆయన్ని చూసి, తమకు సందేహం వచ్చినట్లు తెలిపారు. దీంతో తామంతా ఆలయ సెక్యూరిటీతో చర్చించి... పోలీసులకు సమాచారమిచ్చామని తెలిపారు.

 

రివార్డు దక్కే క్యూలో ఉన్న మరో వ్యక్తి ఆలయం ముందున్న ఓ దుకాణుదారు. ఈయన పేరును స్వయంగా జిల్లా కలెక్టరే పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తం ఆయన గమనిస్తూనే ఉన్నాడని, దూబే అనుమానాస్పద కదలికలను పసిగట్టి పోలీసులకు సమాచారమిచ్చారని కలెక్టర్ పేర్కొన్నారు. ఇలా... ఒక్కొక్కరూ... తమ తమ పాత్రను పోషించారు. యూపీ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రివార్డు ఎవరికి దక్కుంతుందన్నది వేచి చూడాల్సిందే.