ఏపీలోనూ సేమ్ ఇదే సీన్!

Published: Saturday July 11, 2020

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కరోనా నిర్ధారణ పరీక్షల్లోనూ ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో పాజిటివ్‌కు నెగిటివ్ అని.. నెగిటివ్‌కు పాజిటివ్ అంటూ మెస్సేజులు రావడంతో జనాలు వణుకుపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ ల్యాబ్‌లతో పాటు ప్రైవేటు ల్యాబ్‌ల్లో టెస్టులు జరుగుతున్నాయి. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో ఫలితాలు ఆలస్యంగా వస్తున్నా. ..ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఫలితాలపై అనుమానాలు వస్తున్నాయి. 

 

హైదరాబాద్‌లో కొన్ని ప్రైవేటు ల్యాబ్‌ల్లో ఏకంగా 72 శాతం పాజిటివ్ రేటురావడంపై ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు వాటి ఫలితాలను కూడా నిలిపివేసింది. కొన్ని ల్యాబ్‌ల్లో వందమందికి పరీక్షలు చేస్తే 72 మందికి పాజిటివ్ రావడంపై కలకం రేపింది. ప్రపంచంలో ఎక్కడా à°ˆ స్థాయిలో పాజిటివ్ కేసులు రాలేదన్నారు. దీంతో దాదాపు 13 ల్యాబ్‌లకు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పుడు కొందరు ప్రభుత్వ ల్యాబ్‌à°² ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

 

హైదరాబాద్‌లోనే కాదు.. ఏపీలోనూ సేమ్ ఇదే సీన్ కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వం వేల సంఖ్యలో టెస్టులు చేస్తున్నామని చెబుతున్నాఫలితాల విషయంలో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. పాజిటివ్  నెటిగివ్ అని ఆన్ లైన్ లో నమోదు చేయడంతో గందరగోళం నెలకొంటోంది. కాకినాడలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు నెటిటివ్ అంటూ సమాచారం ఇస్తున్నారు. కరోనా ల్యాబ్ నుంచి వచ్చిన పాజిటివ్ రిపోర్టులను వెబ్‌సైట్‌లో నెగిటివ్‌à°—à°¾ అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.