గణన కోసం 3కోట్ల 48లక్షల ఫొటోలు

Published: Sunday July 12, 2020

అక్షరాలా.. 3కోట్ల 48లక్షల 58వేల 623 ఫొటోలు.. వామ్మో! అన్ని ఫొటోలే! అనుకుంటున్నారా.. అవును.. పులుల గణనకు  అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలు తీసిన ఫొటోలు అవి. ఫలితంగా.. పులుల సర్వే కోసం ప్రపంచంలోనే అధిక సంఖ్యలో కెమెరాలు ఏర్పాటు చేసిన దేశంగా 2018 ఏడాదికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ను భారత్‌ సొంతం చేసుకుంది. మోషన్‌(చలన) సెన్సార్లు కలిగిన కెమెరాలను 26,838 ప్రదేశాల్లో.. 1,21,337 చదరపు కిలోమీటర్ల అటవీ పరిధిలో ఉంచారు. మొత్తం ఫొటోల్లో పులులకు సంబంధించినవి 76651, చిరుతలవి 5177 ఉండగా, మిగతావి వివిధ జంతువుల ఫొటోలు. ఇక, à°† ఏడాది గణన ప్రకారం.. ప్రపంచంలోని పులుల సంఖ్యలో 75ు అంటే 2,967 మన దేశంలోనే ఉన్నాయి. డేటా, వనరుల వినియోగం వంటి అంశాల్లో ఇప్పటి వరకూ à°ˆ సర్వేనే సమగ్రమైనదని గిన్నిస్‌ రికార్డ్స్‌ వెబ్‌సైట్‌ తెలిపింది.