బాలుడి అత్యుత్సాహం... రూ. ఐదు లక్షలు హాంఫట్...

Published: Monday July 13, 2020

‘ఆన్‌లైన్ గేమ్’ ఆడాలన్న à°† బాలుడి అత్యుత్సాహం à°† కుటుంబానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. à°† తండ్రి... ఏళ్ళపాటు, దేశం కాని దేశంలో... ఎంతో కష్టపడి తన కొడుకు కోసం పోగు చేసిన డబ్బు ... చివరకు à°† కొడుకు చేసిన చిన్న పొరపాటుతో ఆవిరైపోయింది. à°ˆ ఆర్ధిక దోపిడీకి à°† కుటుంబం కుంగిపోతోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో à°ˆ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. 

 

à°ˆ మధ్యకాలంలో చిన్న పిల్లలను ఆన్‌లైన్ పేరుతో అట్రాక్ట్ చేసి... భారీగా డబ్బులను అకౌంట్ నుంచి దోచేస్తోన్న విషయం తెలిసిందే. à°ˆ క్రమంలోనే... à°“ బాలుడు తన తల్లి స్మార్ట్ ఫోన్ నుంచి ఆన్‌లైన్ గేమ్ లోకి వెళ్లగా ఏకంగా ఐదు లక్షల రూపాయలకు పైగా నగదు ఖాతా నుంచి ఖాళీ అయ్యింది. స్థానిక గణపతి థియేటర్ సమీపంలో ఉంటూ... తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలుడు ఇరవై రోజుల నుంచి ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నాడు.

 

ఇదే క్రమంలో... ‘ఫ్రీ ఫైర్’ అనే ఆన్లైన్ గేమ్ యాప్‌ను ఓపెన్ చేసాడు సదరు బాలుడు. ఇక à°ˆ గేమ్ లో భాగంగా కొత్త వెపెన్స్ కొనాలంటే లింక్ ఓపెన్ చేయాలంటూ à°“ ఆప్షన్ వచ్చింది. అప్పటికే గేమ్ లో నిమగ్నమైన బాలుడు à°† లింకును ఓపెన్ చేశాడు. అందులో వంద నుంచి వెయ్యి రూపాయల వరకు వెపన్స్ ధరలున్నాయి. ఇక వాటిని కొనుగోలు చేయాలనుకుని ఓటీపీ  కూడా ఎంటర్  చేశాడు. ఇలా రూ. వెయ్యి నుంచి రూ. పది వేల వరకు ఆయుధాలు కొనుగోలు చేస్తూ వెళ్ళాడు.

 

à°ˆ క్రమంలో... ఇరవై రోజుల వ్యవధిలోనే రూ. 5.40 లక్షల నగదు ఖాతా నుంచి ఆవిరైపోయింది. à°ˆ క్రమంలో... చివరకు విషయం తెలుసుకుని... ఇక్కడ తల్లి, గల్ఫ్‌లో తండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

తల్లికి à°ˆ విషయం ఎలా తెలిసిందంటే.. ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేద్దామనుకున్న సమయంలో ఆమెకు డబ్బులు రాలేదు. ఏంటా  అని.. అకౌంట్ బాలన్స్ చెక్ చేయగా... తన ఖాతాలో ఉన్న డబ్బులు చూసి అవాక్కయింది. తర్వాత తనకు ఖాతాలు ఉన్న రెండు బ్యాంకులకు వెళ్లి ఆరా తీయగా... అకౌంట్ నుంచి డబ్బులు అన్ని క్రమక్రమంగా డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న  కష్టార్జితం మొత్తం ఆవిరైపోవటంతో  తల్లడిల్లిపోయిన  తల్లి పోలీసులను ఆశ్రయించింది. కువైట్ లో పనిచేస్తున్న తన భర్త కష్టపడి తన అకౌంట్లో డబ్బులు వేస్తే  ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల బారినపడి à°† డబ్బులు మొత్తం పోయాయి అంటూ à°† మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.