లామాల నానో బాడీలతో కరోనాకు చెక్‌

Published: Tuesday July 14, 2020

 à°•à°°à±‹à°¨à°¾ వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ మన శరీర కణాల్లోకి చొరబడేందుకు దాని మొన భాగంతో ఏసీఈ2 ఎంజైమ్‌కు తూట్లు పొడుస్తుంది. దీనిని  అడ్డుకోగలిగితే.. కరోనా వ్యాప్తికి ఆదిలోనే అంతం పలకొచ్చు. à°ˆ దిశగా ప్రయోగాలు జరిపిన బ్రిటన్‌లోని రోసాలిండ్‌ ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఆశాజనక ఫలితాలను సాధించారు. ఒంటెలా ఉండే లామాల రక్తంలోని నానోబాడీలను.. స్పైక్‌ ప్రొటీన్లతో పరస్పరం చర్య జరిపించారు. హెచ్‌11-హెచ్‌4, హెచ్‌11-à°¡à±€4 అనే రెండు  నానోబాడీలు స్పైక్‌ ప్రొటీన్‌ మొన భాగాన్ని దుప్పటిలా కప్పేశాయి. ఫలితంగా ఏసీఈ2లోకి స్పైక్‌ ప్రొటీన్‌ చొచ్చుకు వెళ్లలేకపోయింది.