దళిత జడ్జిపై వైసీపీ శ్రేణుల దాడి

Published: Wednesday July 15, 2020

ఏపీలో దళితులపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై, చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితారాణిపై జరిగిన దాడులు మరువక ముందే.. అదే జిల్లాలో దళిత జస్టిస్‌పై కూడా అదే జులుం ప్రదర్శించారు. తంబలపల్లి నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. ఏకంగా దళిత జడ్జి జస్టిస్ రామకృష్ణపై దాడులకు తెగబడ్డారు. వైసీసీ నేతలు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించిన పాపానికి జడ్జిపై వైసీపీ నేతలు భౌతికదాడులకు పూనుకున్నారు. బి.కొత్తకోటలో దళిత జడ్జి రామకృష్ణ నివసిస్తున్నారు. అయితే à°—à°¤ కొంత కాలంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న భూకబ్జాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి పోరాడుతున్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఫిర్యాదు చేశారన్న అక్కసుతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అనుచరులు రెచ్చిపోయి జడ్జి ఇంటిపైనే దాడి చేసి తమ దురహంకారాన్ని చాటుకున్నారు.

 

గౌరవ ప్రదమైన, బాధ్యతాయమైన జడ్జి పదవిలో ఉన్నవారికే ఇలా జరిగితే సాధారణ ప్రజలు, దళితుల పరిస్థితి ఏంటని అందరూ విస్తుపోతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు మాత్రం దుండగులపై కేసు నమోదు చేయకుండా చోద్యం చూడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అండతో అధికార పార్టీ నాయకుల అక్రమాలు, దాడులు, వివక్ష రోజు రోజుకి ఎక్కువగా ఉందంటూ బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపించింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని బీఎస్పీ నేతలు ప్రకటించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి.. జడ్జి గారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎం మహేష్ స్వేరో తెలిపారు. దళిత బహుజనులు ఇలాంటి దాడులకు భయపడకుండా ముందుకు వచ్చి అందరూ కలసికట్టుగా పోరాడాలని కోరారు.