ఆవుపేడతో వర్మీకంపోస్టు తయారీ

Published: Wednesday July 15, 2020

రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోధాన్ నయా యోజన పథకం కింద గ్రామాల నుంచి ఆవు పేడను సేకరించాలని సర్కారు నిర్ణయించింది. సహకార సంఘాల ద్వారా వర్మీకంపోస్టును తయారు చేసి రైతులకు కిలో 8 రూపాయల చొప్పున విక్రయించాలని భూపేష్ బాగేల్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వర్మీకంపోస్టు తయారీకి సహకార సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సర్కారు నిర్ణయించింది. ఆవు పేడను కొనుగోలు చేసి దాంతో వర్మీకంపోస్టును తయారు చేయాలని నిర్దేశించారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా కొత్తగా గ్రామీణులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు.