యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరు ఖరారు

Published: Saturday July 18, 2020

 à°¯à±‚పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అధిష్ఠానం దాదాపుగా ఖరారు చేసిందా? రాబోయే ఎన్నికల్లో ఆమెను ముందుంచే సమరాంగణంలో కాంగ్రెస్ దూకనుందా? అంటే అవుననే అంటున్నారు. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని అధిష్ఠానం ఫైనల్ చేసిందని, అందుకు ప్రియాంక కూడా అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాదా శనివారం వెల్లడించారు. ఇంతటి వ్యూహాత్మక నిర్ణయాన్ని సీడబ్ల్యూసీ తీసుకుందని ఆయన తెలిపారు.

 

యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంకను తెరపైకి తెస్తారా? అని ప్రశ్నించినపుడు... ‘‘ఇది కార్యకర్తల దీర్ఘకాలిక డిమాండ్. కానీ సీడబ్ల్యూసీ à°ˆ నిర్ణయాన్ని వ్యూహాత్మకంగా తీసుకుంది. ప్రియాంక కూడా ఒప్పుకున్నారు’’ అని జితిన్ ప్రసాద పేర్కొన్నారు. యోగి నేతృత్వంలోని ప్రభుత్వం ‘హెడ్‌లైన్స్‌’ లో మేనేజ్ చేసే ప్రభుత్వమని విమర్శించారు.

 

ప్రియాంకను ట్విట్టర్ లీడర్‌à°—à°¾ బీజేపీ నేతలు విమర్శించడంపై ఆయన మాట్లాడుతూ... వారి పనితీరు ఏమాత్రం బాగోలేదని, దానిని కప్పిపుచ్చడానికి ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్యం, మౌలిక రంగాల్లో యోగి ప్రభుత్వం à°Žà°‚à°¤ చేసిందో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికే బీజేపీ ప్రియాంక గాంధీపై విమర్శలకు దిగుతోందని మండిపడ్డారు. పార్టీని యూపీలో బలోపేతం చేయడానికి వ్యూహం సిద్ధమైందని, బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేస్తున్నామని జితిన్ ప్రసాద ప్రకటించారు.