ప్రైవేటు హాస్టళ్ల తిరకాసు పూర్తి ఫీజుల కోసం సతాయింపు

Published: Monday July 20, 2020

దిల్‌సుఖ్‌నగర్‌లో à°“ ప్రైవేటు హాస్టల్‌లో జనగామ జిల్లాకు చెందిన అనిష్‌ అనే విద్యార్థి ఉండేవాడు ఉండేది. నగర శివారులోని à°“ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతూ ప్రైవేటు హాస్టల్‌కు నెలకు రూ. 5 వేలు చెల్లించేవాడు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. జనతా కర్ఫ్యూ కంటే ముందే లగేజీని హాస్టల్‌లోని వదిలేసి సొంత à°Šà°°à°¿à°•à°¿ వెళ్లాడు. ఇటీవల హాస్టల్‌కు వచ్చి, మార్చి నెలకు సంబంధించిన ఫీజు రూ. 5వేలు చెల్లించాడు. లగేజీ హాస్టల్‌లోనే ఉన్నందున మరో రూ. 5 వేలు చెల్లించాలనుకున్నాడు. కానీ, హాస్టల్‌ యజమాని నాలుగు నెలలకు సంబంధించి రూ. 20 వేలు ఇస్తేనే లగేజీ ఇస్తానంటున్నాడు. 

 

ఉప్పల్‌లోని à°“ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఉంటూ ఘట్‌కేసర్‌లో చదువుకుంటున్న మరో విద్యార్థికీ ఇలాంటి అనుభవమే ఎదురైంది. కరోనా నేపథ్యంలో మార్చి 16 తేదీన విద్యాసంస్థలు మూత పడిన మరుసటి రోజే హాస్టల్‌ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఇటీవల హాస్టల్‌లో ఉన్న లగేజీ కోసం ఫోన్‌ చేయగా, రూ. 25 వేలు చెల్లించి లగేజీ తీసుకెళ్లాలని నిర్వాహకులు చెప్పాడు. అయితే, హాస్టల్‌లో ఉండకుండా, తినకుండా పూర్తి ఫీజు ఎందుకు చెల్లించాలని à°† విద్యార్థి ప్రశ్నించాడు. ఇటీవల తన స్నేహితులతో కలిసి వచ్చి ప్రైవేట్‌ హాస్టల్‌ యజమానితో గొడవకు దిగాడు. చివరకు పోలీ్‌సస్టేషన్‌ మెట్లు ఎక్కే వరకు పరిస్థితి వచ్చింది. 

 

నగరంలోని పలు ప్రైవేటు హాస్టళ్ల యజమాన్యాలు పూర్తి ఫీజు చెల్లిస్తేనే లగేజీ ఇస్తామని అంటున్నాయి. అయితే, పూర్తిఫీజు చెల్లించేది లేదని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. లేడీస్‌ హాస్టళ్ల వద్ద బంధువులు కూడా ఉంటుండటంతో వాగ్వాదం జరుగుతోంది. కొందరు పూర్తిస్థాయి ఫీజులు చెల్లించలేకప హాస్టళ్లలోనే లగేజీ వదిలేసుకుంటున్నారు. మరికొందరు స్థానిక నాయకులతో మాట్లాడించి కొంత మేరకు ఫీజులు చెల్లిస్తున్నారు. 

 

నగరానికి ఉన్నత విద్య కోసం, పోటీ పరీక్షల కోసం వచ్చే విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉండి చదువుకున్నారు. గదులు అద్దెకు తీసుకుని ఉండటం కంటే హాస్టళ్లలో ఉండేందుకే అధిక పాధాన్యం ఇచ్చారు. దీంతో గ్రేటర్‌ పరిధిలో వేల సంఖ్యలో ప్రైవేటు హాస్టళ్లు వెలిశాయి. గతంలో కళాశాలలు, విద్యాసంస్థలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకే హాస్టళ్లు పరిమితం కాగా, ప్రస్తుతం రద్దీ ప్రాంతాల్లో... అన్ని రకాల సదుపాయాలు ఉండే హాస్టళ్లకు అధిక డిమాండ్‌ ఉంటుంది. వేడినీళ్లతో పాటు ప్రీ వైఫై, ఇంటర్నెట్‌ ఇలా పలు సౌకర్యాలను ప్రైవేటు హాస్టళ్లలో కల్పిస్తున్నారు.