కొవిడ్‌తో చనిపోయిన ఎయిరిండియా ఉద్యోగులకు 10 లక్షల రూపాయలు

Published: Tuesday July 21, 2020

కొవిడ్‌తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు నిర్ణీత మొత్తంలో పరిహారం అందించనున్నట్టు ప్రభుత్వ à°°à°‚à°— విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే, సంస్థలో ఎంతమంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు? ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని మాత్రం ఎయిర్ ఇండియా వెల్లడించలేదు. ‘‘చాలా మంది ఉద్యోగులు కొవిడ్ బారినపడ్డారు. కొందరు à°† మహమ్మారికి బలయ్యారు’’ అని జులై 20 నాటి సర్క్యులర్‌లో ఎయిర్ ఇండియా పేర్కొంది. "కుటుంబాల ప్రయోజనాలను కాపాడేందుకు, కొవిడ్-19 కాలంలో మరణించే ఉద్యోగుల కుటుంబానికి, లేదంటే వారి చట్టబద్ధమైన వారసుడికి తాత్కాలిక చెల్లింపు చేయాలని నిర్ణయించాం" అని à°† సర్క్యలర్‌లో ఎయిర్ ఇండియా పేర్కొంది. 

 

కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన శాశ్వత ఉద్యోగుల కుటుంబాలు, చట్టపరమైన వారసుడికి 10 లక్షల రూపాయలు, ఫిక్స్‌డ్ టెర్మ్ కాట్రాక్ట్ ఉద్యోగులకు 5 లక్షలు, ఏడాదిపాటు నిరంతరం పనిచేసిన ఉద్యోగులకు రూ. 90 వేలు లభిస్తాయని ఎయిర్ ఇండియా వివరించింది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి కాంట్రాక్టర్ ద్వారా కానీ, సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కానీ నియమితులై ఉంటే రెండు నెలల స్థూల వేతనాన్ని ఇవ్వనున్నట్టు తెలిపింది. తాత్కాలిక చెల్లింపు సర్క్యులర్ కొవిడ్-19 మహమ్మారి కాలానికి మాత్రమే వర్తిస్తుందని,  1 ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చి 2021 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది.