ఏపీలో పెరిగిన కరోనా మరణాలు

Published: Tuesday July 21, 2020

 à°à°ªà±€à°²à±‹ కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకూ విజృంభిస్తోంది. రోజుకు 4వేలకు పైగానే కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 4,944 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మీడియా బులిటెన్‌లో ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో మంగళవారం నమోదైన కరోనా కేసుల్లో.. ఎక్కువ కేసులు పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మంగళవారం కొత్తగా 623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4314à°•à°¿ చేరింది.

 

పశ్చిమ గోదావరి తర్వాత అత్యధిక కరోనా కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కొత్తగా 577 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు తర్వాత చిత్తూరు జిల్లాలో 560, తూర్పు గోదావరి 524, కర్నూలు 515, అనంతపురం 458, కృష్ణా 424, కడప 322, విశాఖపట్నం 230, విజయనగరం 210, నెల్లూరు 197, ప్రకాశం 171, శ్రీకాకుళం జిల్లాలో 133 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన కరోనా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,668కి చేరింది.

 

ఏపీలో కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగించే విషయం. ఏపీలో కొత్తగా 62 మంది కరోనా వల్ల మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 10 మంది, విశాఖపట్నంలో 9 మంది, చిత్తూరు జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు, గుంటూరులో 5, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించినట్లు ప్రభుత్వం బులిటెన్‌లో వెల్లడించింది. ఏపీలో à°—à°¤ 24 గంటల్లో 37,162 శాంపిల్స్‌ను పరీక్షించగా, 4,944 మంది కోవిడ్-19 పాజిటివ్‌à°—à°¾ నిర్ధారించబడినట్లు ప్రభుత్వం ప్రకటించింది.